కమల్ హాసన్ (Kamal Haasan) -మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో ‘నాయగన్’ తర్వాత.. అంటే దాదాపు 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ‘థగ్ లైఫ్'(Thug Life ). జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ 2వ రోజు నుండి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయింది. 2వ రోజు మించి 3వ రోజు.. 3వ రోజును మించి 4వ రోజు అలా తగ్గుతూనే వచ్చాయి.
5వ రోజు అంటే మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్స్ మరింత డౌన్ అయ్యాయి. చాలా ఏరియాల్లో డెఫిసిట్లు పడ్డాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.76 cr | 
| సీడెడ్ | 0.25 cr | 
| ఉత్తరాంధ్ర | 0.27 cr | 
| ఈస్ట్ | 0.11 cr | 
| వెస్ట్ | 0.08 cr | 
| గుంటూరు | 0.16 cr | 
| కృష్ణా | 0.19 cr | 
| నెల్లూరు | 0.08 cr | 
| ఏపీ+తెలంగాణ టోటల్ | 1.90 cr (షేర్) | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) | 0.21 cr | 
| టోటల్ వరల్డ్ వైడ్ | 2.11 cr (షేర్) | 
‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.2.11 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3.37 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.10.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.