Thug Life Teaser Review: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. ‘థగ్ లైఫ్’ టీజర్ వచ్చేసింది..!

కమల్ హాసన్ (Kamal Haasan) , మణిరత్నం (Mani Ratnam)   కాంబినేషన్ అనగానే అందరికీ ‘నాయకుడు'(నాయగన్) గుర్తుకొస్తుంది. 36 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మద్రాస్ టాకీస్’ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ సంస్థలు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈరోజు కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో ‘థగ్ లైఫ్’ రిలీజ్ డేట్ టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది అనే చెప్పాలి.

Thug Life Teaser Review

ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 45 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఇందులో కథ, కథనాల గురించి పెద్దగా హింట్ ఏమీ ఇవ్వలేదు. కమల్ హాసన్ 3 రకాల షేడ్స్ లో కనిపించారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో తన మార్క్ చూపించారు. శింబు (Silambarasan) కూడా ఒకటి, రెండు చోట్ల కనిపించారు.లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఈ టీజర్లో మెయిన్ హైలెట్ ఏంటంటే, విజువల్స్ అనే చెప్పాలి.

రవి కె చంద్రన్ (Ravi K. Chandran)  సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండబోతుంది అనే సంకేతాలు కూడా ఈ రిలీజ్ టీజర్ తో క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. అలాగే ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉందని చెప్పాలి. 2025 జూన్ 5న ‘థగ్ లైఫ్’ ను విడుదల చేయబోతున్నట్టు కూడా ఈ టీజర్ ద్వారా స్పష్టం చేశారు. లేట్ చేయకుండా ఈ టీజర్ ను ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus