ఓ వ్యక్తి జీవిత కథ అంటూ మొదలై… ఆ కథను స్ఫూర్తిగా తీసుకొని అంటూ మారి… ఇప్పుడు ఆ వ్యక్తి గురించి వచ్చిన పుకార్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ మారింది ‘టైగర్ నాగేశ్వరరావు’. అలా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి అనుకోండి. ఓ ఊరు ప్రజలంతా మా ఊరు గురించి తప్పుగా చూపిస్తున్నారు అంటూ కోర్టుకెక్కడం, ఇంకా మరికొన్ని అంశాల కారణంగా ఎందుకొచ్చిన కష్టం అని ఇలా మార్చారు అని అంటున్నారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి ఇన్ని కథలు, పుకార్లు ఉన్నాయి కదా సినిమాగా రూపాంతరం చెందించడానికి కష్టమనిపించలేదా అని దర్శకుడు వంశీని అడిగితే… ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దాంతోపాటు అసలు స్టూవర్ట్‌పురం గజదొంగగా పేరున్న నాగేశ్వరరావు కథనే ఎందుకు తీసుకున్నారు అని కూడా అడిగితే ఇలానే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ప్రతి దర్శకుడికీ ఒక్క బయోపిక్ అయినా చేయాలని ఉంటుంది. అలానే ఆయన కూడా ఉందట. అయితే ఎలాంటి కథ ఎంచుకోవాలనుకున్నప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చిందని (Vamsee) వంశీ చెప్పారు.
సెలబ్రెటీలు, ప్రముఖుల కథలు లాంటివి కాకుండా ఎవరికీ తెలియని కథ చెబితే బాగుంటుందనిపించింది చేశారు. ఈ క్రమంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ యూనిక్‌గా అనిపించే సరికి చేసేశారట. ఆయన గురించి జనాలకు కొన్ని కథలు తెలుసు. వాటిపై రెండేళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ కథను రాసుకున్నారట. చాలామందికి తెలిసినంత వరకు ఆయనొక దొంగ. కానీ చెప్పాల్సింది చాలా ఉందని పరిశోధనలో తెలుసుకున్నారట. స్టూవర్టుపురంలోని నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని, పోలీసు అధికారులను కలిసి దర్శకుడు చాలా సమాచారం సేకరించారట.
ఆయన గురించి కథలున్నాయి కానీ వాటికి తగ్గ ఆధారాలు లేవు. అందుకే ట్రూ రూమర్స్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా అని టైటిల్స్‌లో వేశాం అని చెప్పారు. అంతేకాదు టైగర్ నాగేశ్వరరావులోని ఎవరికీ తెలియని కోణాన్ని సినిమాలో చూపిస్తున్నాం అంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. అదేంటో తెర మీదనే చూడాలని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేశారు. ఆ సంగతేంటో తేలాలంటే 20వ తేదీ వరకు ఆగాల్సిందే.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!