రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా తాజాగా థియేటర్లలో రిలీజ్ కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. ఒకింత ఆలస్యంగానే ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. టైగర్ నాగేశ్వరరావు ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాల్సి ఉంది.
రవితేజ మాత్రం విక్రమార్కుడు, కిక్ తర్వాత ఆ స్థాయిలో కష్టపడిన సినిమా ఇదేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవితేజ టైగర్ నాగేశ్వరావు మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. రవితేజ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దసరా పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. రవితేజ వయస్సు పెరుగుతున్నా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. మాస్ మహారాజ్ రవితేజ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా రవితేజ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రాబోయే రోజుల్లో రవితేజ మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.
భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!
లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!