Ala Vaikunthapurramuloo Hindi Title: అల.. వైకుంఠపురములో హిందీ టైటిల్ ఫిక్స్!

గత ఏడాది సంక్రాంతి సీజన్ లో వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ తో పాటు థమన్ మ్యూజిక్ త్రివిక్రమ్ మేకింగ్ కు బాక్సాఫీస్ పునాదులు కదిలాయి. దీంతో పక్క ఇండస్ట్రీలో కూడా వైబ్రేషన్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ లో చాలామంది ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు బాగానే చేశారు.

కానీ నిర్మాత అల్లు అరవింద్ చాలా తెలివిగా ఆలోచించి ఏక్తా కపూర్ తో ఒప్పందం కుదుర్చుకొని సంయుక్తంగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సినిమాలో హీరోగా కార్తిక్ ఆర్యన్ ను సెలెక్ట్ చేయగా కృతి సనోన్ ను బుట్టబొమ్మగా ఫిక్స్ చేశారు. ఇక సినిమాకు ఎలాంటి టైటిల్ సెట్ చేస్తారని అనుకుంటున్న సమయంలో ‘షెహ్ జాదా’ అనే టైటిల్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. షెహ్ జాదా అంటే ప్రిన్స్ అని అర్థం. ఇక హీరో క్యారెక్టర్ ను అలాగే పూర్తి కథను హిందీ జనాలకు నచ్చే విధంగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది.

అల.. వైకుంఠపురములో సినిమా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం మ్యూజిక్ అనే చెప్పాలి. తెలుగులో అయితే థమన్ కొట్టిన సాంగ్స్ యూ ట్యూబ్ లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. మరి హిందీలో అలాంటి పాటలను ఎవరు కంపోజ్ చేస్తారో చేస్తారో చూడాలి. ఇక టబు చేసిన తల్లి పాత్రలో మనీషా కొయిరాలా నటించనున్నట్లు సమాచారం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus