రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీకి అక్కినేని వారి టైటిల్?

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ.. ఇందులో గ్రాఫిక్స్ ఉండవని చెప్పినా.. సోషల్ డ్రామా అని వెల్లడించినా… క్రేజ్ మామూలుగా లేదు. పైగా ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు వెండి తెరపైన చూడనటువంటి కాంబినేషన్… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించనున్న చిత్రంపై అధికారిక ప్రకటన రాకముందే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందరి అంచనాలకు మించి సినిమా ఉండాలని రాజమౌళి తన తండ్రితో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ స్క్రిప్ట్ లాక్ కావడానికి మరో 5 నెలలు పట్టవచ్చని సమాచారం. అలాగే ఈ మూవీ దసరాకి సెట్స్ పైకి వెళుతుందని టాక్.

అప్పటి లోపున తారక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ కంప్లీట్ చేయనున్నారు. ప్రస్తుతం రంగస్థలం సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఈ చిత్రంతో పాటు బోయపాటి శ్రీను డైరక్షన్లో మూవీని కూడా కంప్లీట్ చేయనున్నారు. చెర్రీ, తారక్ లు అన్నదమ్ములుగా నటించనున్న ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. “ఇద్దరూ.. ఇద్దరే” అనే పేరుని  ఖరారు చేసినట్లు టాక్. ఈ పేరుతో గతంలో అక్కినేని నాగేశ్వర రావు సినిమా వచ్చింది. ఇందులో ఏఎన్నార్ తో కలిసి నాగార్జున పోటీ పడి నటించారు. అయితే ఈ పేరు పై రాజమౌళి బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus