Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీకి సంక్రాంతి సీజన్ అంతగా కలిసిరాదు. చెప్పుకోవడానికి ‘అల వైకుంఠపురములో’ వంటి రీజనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఉంది. ఆ సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. కానీ అంతకు ముందు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అటు తర్వాత వచ్చిన ‘గుంటూరు కారం’ ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేదు. ‘డాకు మహారాజ్’ కి హిట్ టాక్ వచ్చినా కమర్షియల్ గా నష్టాలనే మిగిల్చింది. అందుకే సంక్రాంతి సీజన్ అనేది నాగవంశీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయినప్పటికీ అతను తగ్గడం లేదు. 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాని రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు.

Naga Vamsi

2026 సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మనశంకర్ ప్రసాద్ గారు’ రిలీజ్ అవుతుంది. దర్శకుడు అనిల్ రావిపూడికి సంక్రాంతి ట్రాక్ రికార్డ్ బాగుంటుంది. ‘ఎఫ్ 2’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అతని ట్రాక్ రికార్డుని గుడ్డిగా నమ్మే.. చిరంజీవి ‘మన శంకర్ ప్రసాద్’ విషయంలో అనిల్ రావిపూడికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు.

కానీ ప్రోమోస్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా కనిపించడం లేదు. గ్లింప్స్ కి సో సో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్లా సాంగ్ ప్రోమో కూడా ఆకట్టుకోలేదు. కాబట్టి ‘మన శంకర్ ప్రసాద్’ … ‘సంక్రాంతికి వస్తున్నాం’ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యే హోప్స్ అయితే ఇవ్వడం లేదు. బహుశా అందుకే వెంకటేష్ కేమియోని ఇరికిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇక ప్రభాస్ ‘రాజాసాబ్’ ట్రైలర్ కూడా తేలిపోయింది. అప్పటివరకు ఉన్న హోప్స్ అన్నిటినీ ట్రైలర్ పడగొట్టేసినట్టు అయ్యింది.

ఎటొచ్చీ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కి మాత్రం మంచి బజ్ ఉంది. సంక్రాంతికి గోదావరి జిల్లాల నేపథ్యంలో సినిమా వస్తుంది అంటే అందరిలో ఆసక్తి పెరుగుతుంది. నవీన్ పోలిశెట్టి హీరో కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి డోకా ఉండదు. సో నాగవంశీ కనుక వెనకడుగు వేయకుండా ఈ సినిమాని సంక్రాంతికి దింపితే.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి భారీ లాభాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ప్రముఖ రచయిత మృతి

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus