మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత చేసిన తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు నిరాశ పరిచాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది. దీంతో ఆశలన్నీ వివి వినాయక్ పై పెట్టుకున్నారు. చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చేసి మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన వినాయక్.. మెగా అల్లుడు కి కూడా హిట్ ఇవ్వాలని చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాకు ముందుగా “ఇంటలిజెంట్” అనే టైటిల్ అనుకున్నారు. అయితే ఇది మరీ క్లాస్‌గా ఉందని టాక్ రావటంతో కొత్తగా మరో పేరు పరిశీలిస్తున్నారు. “ధర్మాభాయ్” అయితే కథకి యాప్ట్ అవుతుందని.. మాస్ కి కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తోంది. అందరూ బాగుందంటే ఈ టైటిట్ నే ఫిక్స్ చేయనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తనని మాస్ ప్రేక్షుకులకి మరింత దగ్గర చేస్తుందని సాయి ధరమ్ తేజ్ ఆశిస్తున్నారు.