హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం లోని టైటిల్ పాటను విడుదల చేసిన దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు

ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd) పతాకం పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయిత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.

ఇప్పటికే హనీమూన్ ఎక్స్‌ప్రెస్ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల అయి సంగీత ప్రేక్షకుల హృదయాలను దోచాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం లోని టైటిల్ ట్రాక్ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు విడుదల చేసి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ “దర్శకుడు బాల నాకు బాగా కావాల్సిన మనిషి, అమెరికా లో చాలా మందికి సినిమా గురించి శిక్షణ ఇచ్చి తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో డీన్ గా పనిచేసాడు, ఇప్పుడు సొంత డైరెక్షన్ లో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే మంచి టైటిల్ తో చిత్రాన్ని నిర్మించారు. యువతరం పాప్ సింగర్ స్ఫూర్తి జితేందర్ ఈ టైటిల్ పాటను స్వరపరచి ఆలపించింది. పాట చాలా మెలోడియస్ గా ఉంది. మా దర్శకుడు బాల కి, నటించిన నటీనటులకు అందరికి శుభాకాంక్షలు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus