ఓ స్టార్ హీరోతో సినిమా చేసే దర్శకనిర్మాతలకు మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకోవడంతో పాటు.. ఆ హీరో రేంజ్ కు తగ్గ విలన్ ను పట్టుకోవడం కూడా పెద్ద పనైపోతుంది. చెప్పాలంటే స్టార్ హీరోయిన్స్ కంటే విలన్స్ కే ఎక్కువ పారితోషికాలు ఇవ్వాల్సి వస్తుందట. గతంలో జరిగిన టాలీవుడ్ నిర్మాతల సమావేశంలో ఈ విషయాన్ని చాలా డిటైల్డ్ గా వర్ణించారు. విలన్ కు అతను అడిగిన పారితోషికం ఇవ్వడంతో పాటు వారు కాల్షీట్లను దక్కించుకోవడం కూడా వీరికి పెద్ద తలనొప్పిగా మారుతుందట. ముఖ్యంగా టాలీవుడ్లో ప్రస్తుతం ముగ్గురు విలన్లు.. నిర్మాతల పాలిట నిజంగానే విలన్స్ గా వ్యవహరిస్తున్నారని టాక్. ఆ ముగ్గురు మరెవరో కాదు సోనూసూద్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు.
కరోనా టైంలో నిజమైన హీరో అనిపించుకున్న సోనూ సూద్ కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది.పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఇతన్ని ఎంపిక చేసుకుని.. ఇతని ఇమేజ్ ను వాడుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సోనూ ఒక్క రోజుకు గాను రూ.20 లక్షల వరకూ ఛార్జ్ చేస్తున్నాడట. ఒకవేళ 20 రోజులు కనుక షూటింగ్లో పాల్గొనాల్సి వస్తే అక్షరాలా రూ.4కోట్ల వరకూ ఇవ్వాలని ముందే అగ్రిమెంట్ రాయించుకుంటాడట. ఇక మరో స్టైలిష్ విలన్ జగపతి బాబు కూడా తక్కువేమీ కాదు.
అప్పట్లో హీరోగా నటించినప్పుడు తీసుకునే పారితోషికానికి మించి ఇప్పుడు అందుకుంటున్నాడని వినికిడి.ఇతను ఒక్కో సినిమాకి రూ.3 నుండీ రూ.4 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. ఇక పైన ఉన్న ఇద్దరూ అందుబాటులో కనుక లేకపోతే ప్రకాష్ రాజ్ ను విలన్ గా పెట్టేస్తుంటారు దర్శకనిర్మాతలు.ఒక వేళ పాజిటివ్ క్యారెక్టర్ చేసినా పారితోషికం విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడట ప్రకాష్ రాజ్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్న ప్రకాశ్ రాజ్ ఒక్కో సినిమాకి 2 కోట్లకి పైగానే పారితోషికం అందుకుంటున్నాడట.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!