టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా వల్లభనేని జనార్ధన్ గుర్తింపును సొంతం చేసుకున్నారు. 120కు పైగా సినిమాలలో నటించిన జనార్ధన్ కాలేజీలో చదువుకునే సమయంలోనే నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన గజదొంగ సినిమాకు జనార్ధన్ దర్శకత్వ శాఖలో అప్రెంటీస్ గా పని చేశారు. ఆ తరువాత రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన మరికొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేశారు.
కొండవీటి సింహం సినిమా మధ్యలోనే బయటకు వచ్చేసిన జనార్ధన్ సొంతంగా అర్జున్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి ఆ సంస్థలో అమ్మగారి మనవరాలు అనే సినిమాను నిర్మించగా కొన్ని కారణాల వల్ల ఆ మూవీ రిలీజ్ కాలేదు. అప్పటి స్టార్ డైరెక్టర్లలో ఒకరైన విజయబాపినీడు మూడో కుమార్తెను జనార్ధన్ వివాహం చేసుకోవడం గమనార్హం. ఆ తరువాత శ్రీమతి కావాలి అనే సినిమాతో జనార్ధన్ నటుడిగా మారారు.
గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఎస్పీ పాత్ర జనార్ధన్ కు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. జనార్ధన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తాతగారు ఉమ్మడి ఏపీలోని టాప్ 5 బిజినెస్ మ్యాన్స్ లో ఒకరని చెప్పారు. తన తాతగారు సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు 400 కోట్ల రూపాయలు ఉంటుందని తాను, తన తండ్రి సంపాదించిన ఆస్తి ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదని ఆయన అన్నారు. ఈ టాలీవుడ్ విలన్ ఆస్తులు తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!