ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ ఎం.బాలయ్య గారు ఈ రోజు మరణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడ లో ఉన్న ఆయన స్వగృహంలోనే బాలయ్య గారు మరణించారు.దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.బాలయ్య గారి వయసు 94 సంవత్సరాలు. ఈయన నటుడిగా 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పై ఎత్తు చిత్రంతో నటుడు నటుడిగా మారిన బాలయ్య గారు… అటు తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా, కథా రచయితగా కూడా పనిచేశారు.
‘అమృత ఫిల్మ్స్’ అనే సంస్థను స్థాపించి శోభన్ బాబుతో ‘చెల్లెలి కాపురం’, సూపర్ స్టార్ కృష్ణ- కె.విశ్వనాథ్ గారితో ‘నేరము – శిక్ష’, మెగాస్టార్ చిరంజీవితో ‘చుట్టాలున్నారు జాగ్రత్త’, ‘ఊరికిచ్చిన మాట’ వంటి చిత్రాలను నిర్మించారు.ఇక దర్శకుడిగా అయితే ‘పసుపు తాడు’, ‘నిజం చెబితే నేరమా’, ‘పోలీసు అల్లుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ‘ఊరికిచ్చిన మాట’ చిత్రానికి గాను ఉత్తమ కథా రచయితగా నంది అవార్డుని అందుకున్నారు.
‘చెల్లెలి కాపురం’ చిత్రానికి మంచి నిర్మాతగా నంది అవార్డుని అందుకున్నారు. బాలయ్య గారి కుమారుడు తులసీరామ్ కూడా పలు చిత్రాల్లో హీరోగా నటించారు.కానీ ఈయన హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఇక శ్రీ బాలయ్య మృతికి చింతిస్తూ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు పెద్దలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!