హిందీ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ బ్యూటీస్?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది నటీనటులు పాల్గొని అనంతరం ఈ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకొని వరుస సినిమాలు వెబ్ సిరీస్ లో అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి హనుమంత్, రేష్మా పసుపులేటి ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ బిగ్ బాస్ బ్యూటీలకు ఏకంగా హిందీ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందని చెప్పాలి.

వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం లతో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన వీరిద్దరూ కలిసి బీఎఫ్ఎఫ్ అనే కొత్త వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. అయితే వీరు నటిస్తుంది డైరెక్టుగా హిందీ వెబ్ సిరీస్ లో కాదు.. హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సందడి చేసిన అడల్టింగ్ అనే వెబ్ సిరీస్ ను తెలుగు ఓటీటీ ఆహా కోసం బీఎఫ్ఎఫ్ గా రీమేక్ చేస్తున్నారు. హిందీ వెబ్ సిరీస్ లో అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా, విరాజ్ గెహ్లానీ తదితరులు కీలకపాత్రలలో నటించారు.

ఈ క్రమంలోని తెలుగులో వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న సిరి హనుమంత్, రేష్మా పసుపులేటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రెస్ మీట్ జరగడంతో ఈ సిరీస్ కు సంబంధించిన వారు అందరూ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. నేటి యువతరానికి అద్దం పట్టే ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

హిందీలో మంచి సక్సెస్ అందుకున్న ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక పోతే ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పర్చుకోవడం కాకుండా కాస్త నెగిటివిటీ కూడా మూటగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus