మొత్తానికి ఎన్నికల రోజు రానే వచ్చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళని దూషించడం.. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం వంటివి మనం చూశాం. మే 10 తో ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. సో నాయకుల పని ముగిసి 3 రోజులు అయ్యింది. ఇప్పుడు ఓటర్ల వంతు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి పక్క రాష్ట్రాల నుండే కాదు..
పక్క దేశాల నుండి కూడా జనాలు భారీ తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుండే పోలింగ్ మొదలైంది. ఎంతోమంది ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించుకుని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వంటివి మనం చూస్తున్నాం.ఇందులో భాగంగా సినీ తారలు కూడా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘భవిష్యత్-తరాల కోసం మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని’ వారంతా పిలుపునిస్తున్న విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాం.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు వేశారు. రాంచరణ్ (Ram Charan) , ఉపాసన..లు కూడా జూబ్లీహిల్స్ క్లబ్లోనే ఓటు వేయడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన భర్తతో కలిసి మంగళగిరిలో ఉన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) జూబ్లీహిల్స్ లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద ఓటు వేయడం జరిగింది.
ఎన్టీఆర్ (Jr NTR) కూడా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. అలాగే నాగ చైతన్య (Naga Chaitanya) , అది సాయి కుమార్ (Aadi Saikumar) , సందీప్ కిషన్ (Sundeep Kishan) .. తో సహా పలువురు సినీ హీరోలు అలాగే మరికొందరు నటీనటులు ఓటు తమ హక్కు వినియోగించుకున్నట్టు ఫోటోలు షేర్ చేశారు.