నటన వేరు, చదువు వేరు. సినిమాల్లో నటించాలంటే పెద్దగా చదువుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన హీరోలు తన నటనతో అభిమానుల మనసులను గెలుచుకోవడానికి ముందే అత్యధిక మార్కులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అటువంటి టాలీవుడ్ హీరోలపై ఫోకస్….
వెంకటేష్విక్టరీ వెంకటేష్ కి కూడా చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఆశ ఉండేది. అందుకే లయోలా డిగ్రీ కాలేజీలో డిగ్రీ (కామర్స్) చేశారు. అనంతరం అమెరికాలోని మానిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో MBA చదివారు.
నాగార్జునమద్రాస్ లో నాగార్జున ఇంజినీరింగ్ చదివారు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ని మిచిగాన్ యూనివర్సిటీ (అమెరికా) లో పూర్తి చేశారు. తర్వాత తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి అడుగుపెట్టి టాలీవుడ్ కింగ్ అయ్యారు.
రాజశేఖర్సినిమాల్లో చాలా ఆవేశంగా కనిపించే రాజశేఖర్ ఎంబీబీఎస్ ని చదివారు. కొంతకాలం వైద్యం కూడా చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు.
సిద్దార్ధ్యువ హీరో సిద్దార్ధ్ ఢిల్లీలో డిగ్రీ వరకు చదివారు. కిరోరి మాల్ కాలేజీలో సిద్ధార్థ్ B.Com చేశారు. అలాగే
MBA మంచి మార్కులతో పాసయ్యారు.
నారా రోహిత్నారా రోహిత్ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి బీ టెక్ పట్టా అందుకున్నారు. తర్వాత న్యూ యార్క్ లో ఫిలిం కోర్సులు చేశారు.
సాయి ధరమ్ తేజ్మనదేశాల్లో మంచి పేరున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు.
అఖిల్అఖిల్ విద్యాభ్యాసం మొత్తం విదేశాల్లోనే సాగింది. కాలేజ్ ఆఫ్ మెరైన్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ సౌత్ ఫ్లోరిడా నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. హాలీవుడ్ లో నటనకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చేశారు.
కళ్యాణ్ రామ్కళ్యాణ్ రామ్ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసారు. తర్వాత ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లో MBA కంప్లీట్ చేశారు.
నాగ చైతన్యయువ సామ్రాట్ నాగచైతన్యకి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే లండన్ లోని మ్యూజిక్ కాలేజీలో కీ బోర్డు నేర్చుకున్నారు. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.