20 రోజుల క్రితం డైరెక్టర్ వాసు వర్మ కూడా అరెస్ట్ అయ్యాడట!

‘కబాలి’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత కేపీ చౌదరిని జూన్లో రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు విషయమై పోలీసులు కేపీ చౌదరిని విచారిస్తూ ఉండగా మరో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్త, టాలీవుడ్ దర్శకుడు అయిన వాసు వర్మ, పృథ్వీ కృష్ణ ప్రధాన నిందితులు అని తేలింది. టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ కొడుకు శ్రేయాన్ కపూర్ హీరోగా నటించిన ‘బస్తీ’ చిత్రాన్ని వాసు వర్మ దర్శకత్వం వహించారు. అయితే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆయన వ్యాపారవేత్తగా చర్చల్లో నిలిచారు కానీ దర్శకుడు అని చాలా మందికి తెలీదు.

అందుకే మొదట వాసు వర్మ పరారీ అయినట్టు సమాచారం. అతనితో పాటు నిందితుడైన పృథ్వీకృష్ణను మాత్రం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాసు వర్మని కూడా 20 రోజుల క్రిందటే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. వీళ్ళిద్దరూ ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక్ వద్ద డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

ఇదిలా ఉండగా.. వాసు, పృథ్వీలతో పాటు ఇంకా టాలీవుడ్ కి చెందిన నిర్మాతలు, యంగ్ డైరెక్టర్లు కూడా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నట్టు టాక్. దాదాపు 50 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు స్పష్టమవుతుంది. ఇందులో హీరో నవదీప్ను కూడా ఉన్నారు. శనివారం జరిగిన విచారణకు అతను కూడా హాజరవడం జరిగింది. దాదాపు 6 గంటల పాటు అతన్ని పోలీసులు విచారించినట్లు ఇన్సైడ్ టాక్.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus