అగ్రదర్శకులకు విందు ఇచ్చిన వంశీ పైడిపల్లి!

  • June 5, 2018 / 08:14 AM IST

ఒక డైరక్టర్ సినిమా వేడుకకు మరో డైరక్టర్ హాజరవడం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకరి దర్శకుడి సినిమా షూటింగ్ స్పాట్ కి మరో దర్శకుడు వెళ్లడం ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్రదర్శకులంతా ఒకే చోట చేరితే కనులపండువుగా ఉంటుంది. అటువంటి కలయికకు డైరక్టర్ వంశీ పైడిపల్లి నాంది పలికారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి తన ఇంట్లో సోమవారం రాత్రి తోటి దర్శకులకు ఓ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీ కి  ప్రముఖ దర్శకులంతా హాజరయ్యారు.

వీరంతా కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. “అద్భుతమైన వ్యక్తులతో మరిచిపోలేని సాయంత్రం గడిపాను” అని ట్వీట్ చేశారు. ఈ పార్టీలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్‌, క్రిష్‌, కొరటాల శివ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, నాగ్‌ అశ్విన్‌, వంశీ పైడిపల్లిలతో పాటు ఒకే ఒక్క సినిమా అర్జున్ రెడ్డితో పాపులర్ అయిన సందీప్‌ రెడ్డి వంగా ఉన్నారు. ఆహ్వానాన్ని మన్నించి తన ఇంటికి వచ్చిన అందరికీ వంశీ సోషల్ మీడియా వేదిక పై కృతజ్ఞతలు తెలిపారు.

మా సినిమాల మధ్య పోటీ ఉంటుంది కానీ.. మా మధ్య ఎటువంటి పోటీ ఉండదని, స్నేహం ఎప్పటికీ ఉంటుందని ఈ పార్టీ ద్వారా దర్శకులు స్పష్టం చేశారు. ఈ పార్టీ టాలీవుడ్ లోని ఆరోగ్యకర వాతావరణాన్నీ ప్రతిభింబిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus