Tollywood: పాన్ ఇండియా మార్కెట్ లో మనోళ్ళ ఊచకోత!

ఇండియన్ సినిమా మార్కెట్‌లో తెలుగు చిత్రాలు నిత్యం కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ‘బాహుబలి’తో (Baahubali) మొదలైన పాన్ ఇండియా ట్రెండ్ తెలుగు చిత్ర పరిశ్రమను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. 2024లో ఈ హవా మరింత ప్రబలగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాల్లో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం గమనార్హం. ఈ ఏడాది పెద్ద సినిమాల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule)  అగ్రస్థానంలో నిలిచింది.

Tollywood

రీసెంట్‌గా ఈ చిత్రం 1500 కోట్ల క్లబ్‌లో చేరి, ‘బాహుబలి 2’ (Baahubali 2) రికార్డును ఛాలెంజ్ చేసే స్థాయికి చేరింది. హిందీ బెల్ట్‌లో సైతం ఈ సినిమా 700 కోట్ల నెట్‌ దిశగా దూసుకుపోతుండటం తెలుగు సినిమాల శక్తిని మరోసారి రుజువు చేస్తోంది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 28988 AD’ (Kalki 2898 AD) రెండో స్థానంలో నిలిచింది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 1200 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభాస్ (Prabhas) క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.

ఈ చిత్రంలో అమితాబ్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan), దీపికా పదుకొణె (Deepika Padukone) వంటి దిగ్గజ నటుల భాగస్వామ్యం విజయం సాధించేందుకు కారణమైంది. ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర పార్ట్-1’ (Devara) భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా 520 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. మరోవైపు, ‘హనుమాన్’ (Hanuman) లాంటి చిన్న బడ్జెట్ చిత్రం 350 కోట్ల వసూళ్లతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. అయితే, విజయాలతో పాటు డిజాస్టర్ల జాబితా కూడా ఉంది. వరుణ్ తేజ్ (Varun Tej) ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine), రామ్ పోతినేని (Ram) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి.

పెద్ద బడ్జెట్, భారీ ప్రమోషన్ కూడా వీటిని ఆదుకోవలేకపోయాయి. వచ్చే ఏడాది ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘ఘాటీ’ (Ghaati), ‘OG’ (OG Movie) , ‘హిట్ 3’, ‘అఖండ 2’ (Akhanda 2) వంటి పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. టాలీవుడ్ మేకర్స్ కంటెంట్‌తో పాటు బడ్జెట్ పరంగా కూడా ప్రమాణాలు పెంచుతుండటంతో బాలీవుడ్ సినిమాలపై మనవారి ఆధిపత్యం కొనసాగడం ఖాయం. ఇక రాబోయే రోజుల్లో పాన్ ఇండియా వేదికపై తెలుగు (Tollywood) సినిమాలు ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాలి.

కోలీవుడ్ డైరెక్టర్.. రాజమౌళి కంటే పెద్ద ప్లానే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus