మహేష్ తో కలిసి అల్లరి చేయడానికి ఒకే చెప్పిన నరేష్

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న భరత్ అనే నేను సినిమా రిలీజ్ కి ముస్తాబవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు రెస్ట్ తీసుకోవడం లేదు. వెంటనే నెక్స్ట్ చేసే సినిమాని ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన పనులు జోరుగా సాగుతున్నాయి. మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రానికి వంశీ పైడి పల్లి ఆర్టిస్టులను సెలక్ట్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ని ఖరారు చేశారు. అలాగే సినిమాలో కీలకమైన స్నేహితుడి పాత్ర కోసం అల్లరి నరేష్ ని ఫిక్స్ చేశారు.

ఇక నరేష్ పక్కన జోడీని కూడా ఓకే చేసినట్లు తెలిసింది. ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలిని పాండే ని సెలక్ట్ చేసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నారు. ఊపిరి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్నఈ సినిమా ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లో సాగనుంది. ఎక్కువగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఇదివరకు తెలుగు తెరపై చూడనటువంటి లొకేషన్లను వంశీ సెలక్ట్ చేసినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మూవీ వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus