2020 లోకి ఎంటర్ అయ్యి అప్పుడే 3 నెలలు పూర్తయ్యింది. ఇప్పటి వరకూ మన టాలివుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను గమనిస్తే.. జనవరి 9న ‘దర్బార్’ చిత్రం తో రజినీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తరువాత 2 రోజులకి.. అంటే జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ తో మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రం ఇదే..!
కానీ ఫుల్ రన్ లో 138 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక జనవరి 12 న వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం విడుదలైంది. సంక్రాంతి విన్నర్ గా నిలిచిన ఈ చిత్రం ఏకంగా 160 కోట్ల షేర్ ను రాబట్టి నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఆ తరువాత వచ్చిన ‘డిస్కో రాజా’ చిత్రం డిజాస్టర్ కాగా..
నాగ శౌర్య ‘అశ్వద్ధామ’ ఎబౌవ్ యావరేజ్ కాగా .. ‘జాను’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు డిజాస్టర్ లుగా మిగిలాయి. ఇక ‘ప్రెజర్ కుక్కర్’ ‘పలాస’ వంటి చిత్రాలు కూడా డిజాస్టర్ లు అయ్యాయి. ఇక తరువాత వచ్చిన ‘భీష్మ’ ‘హిట్’ చిత్రాలు సూపర్ హిట్ గా నిలవగా… ‘కనులు కనులని దోచాయంటే’ వంటి డబ్బింగ్ చిత్రం హిట్ గా నిలిచింది.
Most Recommended Video
ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్