Tollywood: మేలు చేసిందని పొగిడితే.. పొడిచేసిందిగా!

కరోనా టైమ్‌లో బాగా బాగుపడిన వాటిలో ఓటీటీ ఒకటి. మన దేశంలో అప్పటికే ఓటీటీలు ఉన్నా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రేక్షకులు ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. దీంతో థియేటర్లకు వెళ్లి సగటు సినిమా చూద్దామనే ఆలోచనకు దూరమయ్యారు. అయితే తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి నిర్మాతలకు ఓటీటీ మంచి సాధనంగా ఉపయోగపడింది. దీంతో ఓటీటీలను ఆ రోజుల్లో తెగ పొగిడేశారు. అందుబాటులో అందరికీ వినోదం అంటూ ఆకాశానికెత్తారు. అయితే ఇప్పుడు నిర్మాతల మాట మారింది. ఓటీటీ అంటే అమ్మో అంటున్నారు.

ఓ ఓటీటీ ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రముఖ నిర్మాతను మీడియా ప్రతినిధి ఓ మాట అడిగారు. ‘‘రేపొద్దున కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఇలాగే ఓటీటీలను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తారా, ఓటీటీల కోసం డబ్బులు ఖర్చు పెడతారా?’’ అని ఆ నిర్మాతను అడిగితే.. ‘‘కచ్చితంగా చేస్తాం. సినిమా, ఓటీటీ దేని పని దానిదే’’ అని చెప్పారు. కానీ ఆ నిర్మాతే ఇప్పుడు ఓటీటీల వల్ల సినిమా హాళ్లకు తద్వారా సినిమాకు ఇబ్బంది వస్తోంది అంటున్నారు.

దేశంలో ఓటీటీల వల్ల ఇబ్బంది పడుతున్న సినిమా ఇండస్ట్రీలో తొలి స్థానాల్లో బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సమస్యను ఫిక్స్‌ చేసుకోవడానికి బాలీవుడ్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఆగస్ట్ 1 నుండి థియేటర్‌ రిలీజ్, ఓటీటీ రిలీజ్‌కు మధ్య కనీసం ఎనిమిది నుండి పది వారాలు గ్యాప్‌ ఉండేలా బాలీవుడ్‌ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం టాలీవుడ్‌కి చాలా అవసరం. దీనికి మల్టీప్లెక్స్‌ చైన్స్‌ మద్దతు తెలుపుతాయి అనడంలో సందేహం లేదు.

ఓటీటీల వల్ల మల్టీప్లెక్స్‌ ఓనర్లు ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారట. మల్టీప్లెక్స్‌లకు వచ్చే క్లాస్‌ జనాలు ఇళ్లలో ఉండిపోయి హోం థియేటర్లు, పెద్ద పెద్ద టీవీల్లో ఓటీటీల్లో సినిమాలు చూసేస్తున్నారట. టాలీవుడ్‌ నిర్మాతలు కూడా త్వరలో ఈ వ్యవహారం మీద మీటింగ్‌ పెట్టుకోబోతున్నారట. అందులో పక్కాగా నిర్ణయం తీసుకుంటే.. తెలుగు సినిమాకు, థియేటర్లకు మంచి రోజులు తిరిగి వస్తాయి అని చెప్పాలి. అన్నట్లు పనిలో పనిగా మంచి సినిమాలు కూడా తీయాలి. చెత్త సినిమాలు తీసి థియేటర్లకు జనాలు రావడం లేదు అనకూడదు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus