ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో దేవర సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మల్టీస్టారర్ అని వార్తలు వినిపిస్తున్నా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు పని చేస్తున్న నటీనటులు మాత్రం 2024 సంవత్సరం దేవర సినిమాదే అని కామెంట్లు చేస్తున్నారు. నమ్మి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ నమ్మకాన్ని కొరటాల శివ కచ్చితంగా నిలబెట్టుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరో ఒకరు దేవర బ్రదర్ సూరిగాడు పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే దేవర టీం స్పందించనంత వరకు ఈ వార్తను ఫేక్ వార్తగానే భావించాలి. దేవర మల్టీస్టారర్ అయితే ఆ విషయాన్ని ముందుగానే రివీల్ చేసేవారు. ఈ సినిమాలో మరో స్టార్ హీరోకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా లేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్విట్టర్ లో దేవర గ్లింప్స్ హ్యాష్ ట్యాగ్ నెట్టింట వైరల్ అవుతుండగా ఆ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.
దేవర సినిమాకు సంబంధించి ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి కాగా 20 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. దేవర సినిమాకు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
ఈ సినిమా సీడెడ్ హక్కులు 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. దేవర (Devara) సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమా మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!