టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు ఎవరనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు కెరీర్ తొలినాళ్లలో కొత్త డైరెక్టర్లకు తమ సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ స్టార్స్ లో చాలామంది కొత్త దర్శకుల కథలు కూడా వినడం లేదని తెలుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకులైన సుజీత్, రాధాకృష్ణ కుమార్ లకు అవకాశాలు ఇచ్చారు. అయితే ఈ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. అల్లు అర్జున్ దర్శకునిగా ఒక సినిమా అనుభవం కూడా లేని వక్కంతం వంశీకి ఛాన్స్ ఇవ్వగా వంశీ దర్శకత్వం వహించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ దర్శకునిగా ఒక్క సినిమా అనుభవం ఉన్న సంతోష్ శ్రీనివాస్ కు ఛాన్స్ ఇవ్వగా రభస సినిమా ఫ్లాపైంది.
పవన్ కళ్యాణ్ టాలెంట్ ఉన్న కొంతమంది డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చినా ఆ డైరెక్టర్లలో ఎక్కువమంది డైరెక్టర్లు నిరాశపరిచారు. మహేష్ బాబు చాలాకాలం తర్వాత స్టార్ డైరెక్టర్ కాని పరశురామ్ కు ఛాన్స్ ఇవ్వగా సర్కారు వారి పాట ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది. రిస్క్ తీసుకున్న ప్రభాస్ కు చేదు ఫలితాలు ఎదురు కావడంతో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. మరోవైపు పవన్, మహేష్ పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు సాధించాల్సి ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరోల భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి. అయితే ఈ హీరోలలో ఎంతమంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా సక్సెస్ సాధిస్తారో చూడాల్సి ఉంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చాక కూడా ప్రభాస్ రిస్క్ లు చేస్తున్నా మిగతా స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!