బీటౌన్ ని అల్లాడిస్తున్న తెలుగు సినిమాలు..!

  • February 20, 2021 / 03:38 PM IST

సౌత్ ఇండియన్ సినిమాలకి బాలీవుడ్ అల్లాడిపోతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు కొట్టే దెబ్బ మామూలుగా లేదు. బీ టౌన్ లో అగ్రహీరోలు సైతం తమ సినిమాలని తెలుగు హీరోల సినిమాల డేట్స్ ని చూసి మరీ రిలీజ్ చేస్తున్నారు. రీసంట్ గా బోనీకపూర్ సైతం ట్రిబుల్ ఆర్ రిలీజ్ విషయంలో తన అసంతృప్తిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతలా తెలుగు సినిమా బాలీవుడ్ పై ప్రభావాన్ని చూపిస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్ చేసినప్పటి నుంచీ ఇది ఇంకా ఎక్కువైపోయింది. తెలుగులో వచ్చిన సూపర్ హిట్ సినిమాలని సైతం అక్కడ కుర్రహీరోలు రీమేక్ చేసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ టైమ్ లో ఇప్పుడు 2021 లో రాబోతున్న తెలుగు హీరోల సినిమాలు బాలీవుడ్ ని బెంబేలెత్తించబోతున్నాయి.

ముందుగా మనం పుష్ప సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈసారి అల్లు అర్జున్ సాలిడ్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు. ఆగష్టు 13వ తేదిన సినిమా విడుదల కాబోతోంది. సుకుమార్ మార్క్ వర్కౌట్ అయితే మాత్రం సినిమాకి తిరుగుండదు. ఎందుకంటే, ఇప్పటికే అల్లు అర్జున్ డ్యాన్స్ కి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. భాషాభేదం లేకుండా అలవైకుంఠపురములో పాటలు ఎంతటి సూపర్ హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇవి బాలీవుడ్ లో కూడా బంపర్ హిట్. సో, అల్లువారబ్బాయి ఖచ్చితంగా బాలీవుడ్ మార్కెట్ ని గట్టి దెబ్బే కొడతాడు. హిందీలో పుష్ప సినిమా హిట్ అయ్యిందంటే, నెక్ట్స్ అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ హిందీలో కూడా ప్లాన్ చేస్తారు. ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. అక్కడ హీరోలకి కాస్త నష్టమైన భరించాల్సిందే.

నెక్ట్స్ విజయ్ దేవరకొండ ఈవరసలో ముందున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో విజయ్ కి ఫ్యాన్ పాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంది. బాలీవుడ్ లో అయితే సెలబ్రిటీలు సైతం విజయ్ ఫ్యాన్స్. సో లైగర్ హిట్ అయ్యిందంటే మనోడికి తిరుగుండదు. బాలీవుడ్ షేక్ అయిపోవాల్సిందే. తర్వాత సినిమాలు కూడా హిందీలో స్ట్రయిట్ గా రిలీజ్ చేసేస్తాడు. లైగర్ సినిమాని కరణ్ జోహార్ రిలీజ్ చేస్తాడు కాబట్టి భారీ స్క్రీన్స్ ప్లాన్ చేస్తాడు. సో కలక్షన్స్ పరంగా ఖచ్చితంగా సూపర్ సక్సెస్ ని అందుకుంటుంది. సో, విజయ్ దేవరకొండ కూడా అక్కడ గట్టి దెబ్బ కొట్టేందుకు , లైగర్ గా తన పంచ్ పవర్ చూపేందుకు సిద్ధమైపోయినట్లే.

ఇక తర్వాత చెప్పాల్సిందే ప్రభాస్ గురించి.. ఇప్పటికే బాహుబలి కొట్టిన దెబ్బకి అక్కడ అందరికీ ఫ్యూజ్ లు పగిలిపోయాయి. సినిమాలో ఏముందబ్బా.. అనుకునే లోపే 1000కోట్లు దాటేసింది ఈసినిమా. బాలీవుడ్ లో సైతం కలక్షన్స్ త్సునామీని సృష్టించింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే అక్కడ అగ్రహీరోలు సైతం వాళ్ల సినిమాలని పోస్ట్ పోన్ చేస్కోవాల్సిందే నో డౌట్. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాతో, అలాగే రాబోతున్న ఆదిపురుష్, సలార్ సినిమాలతో బాలీవుడ్ బాద్షా అయిపోతాడు మనోడు. రాధేశ్యామ్ లవ్ స్టోరీ బీటౌన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందంటే ప్రభాస్ రేంజ్ మరోలా ఉంటుంది. ఆ కథే వేరు.

ఇక నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు ఈసారి బాలీవుడ్ మార్కెట్ ని కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఇది కూడా యస్ యస్ రాజమౌళి సినిమా కాబట్టి మార్కెట్ కి ఎలాంటి ఢోకా ఉండదు. బాలీవుడ్ లో ఈజీగా సేల్ అవుతుంది. అయితే, ఈ ఇద్దరు హీరోలు తమ టాలెంట్ తో ఎలాగో స్క్రీన్ పైన మెప్పిస్తారు కాబట్టి వీళ్లకి మంచి మార్కెట్ ఉంటుంది. రాబోయే సినిమాలు హిందీలో కూడా రిలీజ్ చేస్కోవచ్చు. ఈ విషయంలో ఎన్టీఆర్ కంటే కూడా రామ్ చరణ్ ముందున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ ప్రియాంకతో కలిసి జంజీర్ సినిమా చేశాడు కాబట్టి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. సో ఈజీగా కనెక్ట్ అయిపోతాడు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అనే పేరు కూడా ఉంది. ఇక ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చరణ్ సీనే వేరు. శంకర్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో కూడా బాలీవుడ్ లో పాగా వేసేస్తాడు. అక్కడ హీరోలకి ఇది గట్టిగానే తగిలే దెబ్బే.

ఇక సౌత్ లో ప్రిన్స్ గా ఉన్న మహేష్ బాబు ఎప్పట్నుంచో బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. కానీ, సరైన అవకాశం దొరకలేదు. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే, మార్కెట్ చేయడానికి నమ్రతా శిరోత్కర్ ఎలాగో ఉంది. సో ఇది చాలా ఈజీ. రాజమౌళి సినిమాతో మహేష్ బాబు మంచి మార్కెట్ కొడితే బాలీవుడ్ లో తిరుగుండదు. నెక్ట్స్ రాబోయే సినిమాలకి ఇది బేసిక్ ఫ్లాట్ ఫార్మ్ అయిపోతుంది. మహేష్ బాబు సినిమాలకి బీటౌన్ లో మంచి గిరాకీ ఉంది. డబ్బింగ్ చేసిన సినిమాలకి మంచి వ్యూస్ వస్తుంటాయి కూడా. ఇక అగ్రహీరోలే కాకుండా కుర్రహీరోలు సైతం బాలీవుడ్ మార్కెట్ పై కన్నేస్తున్నారు. రామ్, నాని, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్, ఇలా ఒక్కొక్కరుగా బీటౌన్ ని టార్గెట్ చేస్తే అక్కడ హీరోలకి చుక్కలు కనిపిస్తాయనే చెప్తున్నారు సినీ పండితులు.. మొత్తానికి అదీ మేటర్.


Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus