Tollywood: ఓర్మాక్స్‌ మీడియా సర్వేలో మొదటి స్థానం దక్కించుకున్న ఎన్టీఆర్, సమంత..?

సాధారణంగా సినీ పరిశ్రమలో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడి ఉంటుంది.ఈ క్రమంలోనే ఒకరిని మించి మరొకరు సినిమాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ప్రేక్షకులను సంపాదించుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు పెద్దఎత్తున సినిమాలలో నటిస్తూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ‘ఓర్మాక్స్‌ మీడియా’ వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటీనటులు ఎవరు అనే విషయం గురించి సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ టెన్ సెలబ్రెటీల లిస్ట్ విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా మోస్ట్ పాపులర్ హీరోగా ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండగా నటిగా సమంత మొదటి స్థానంలో ఉంది. ఎన్టీఆర్ తర్వాత వరుస స్థానాలలో ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక టాప్ టెన్ హీరోయిన్ల విషయానికి వస్తే…

మొదటి స్థానాన్ని సమంత కైవసం చేసుకోగా ఆ తర్వాత వరుసగా కాజల్ అగర్వాల్‌, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్, రాశీ ఖన్నా టాప్ టెన్ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల స్థానంలో ఎన్టీఆర్ సమంత మొదటి స్థానంలో ఉండడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సర్వేలో భాగంగా కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా టాప్ టెన్ బాలీవుడ్ సెలబ్రిటీల జాబితాను కూడా విడుదల చేశారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus