ఆ డేట్ పై కన్నేసిన టాలీవుడ్ మేకర్స్!

వచ్చే నెల దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ‘గాడ్ ఫాదర్’, ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’, ‘జిన్నా’ వంటి సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన ఏ హీరో కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఆ తరువాత వారం 14న మాత్రం పెద్దగా పేరున్న సినిమాలేవీ రావడం లేదు. కానీ అక్టోబర్ 21దీపావళి పండగ నాడు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద వార్ జరగబోతుంది.

ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన సినిమాల్లో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ ఉంది. నిజానికి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ అనేసరికి సినిమాపై బజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. వెంకీ ఫ్యాన్స్ అయితే ఆయన సినిమానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక అదే రోజున మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ను రిలీజ్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్లు సమాచారం. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. సినిమా నుంచి చిన్న గ్లిమ్ప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేశారు. ఈ సినిమాతో పాటు దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తోన్న ‘ప్రిన్స్’ కూడా అదే సమయానికి రిలీజ్ కానుంది. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. దివాలీ తమిళులకు కూడా ముఖ్యమైన పండగ కావడంతో ఆ ఛాన్స్ ను వదులుకోవడం టీమ్ కి ఇష్టం లేదు. కార్తీ నటించిన ‘సర్ధార్’ని కూడా అప్పుడే రిలీజ్ చేసే దిశగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే ‘ఓరి దేవుడా’ సినిమా తప్ప ఇప్పటివరకు ఏదీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాలతో పాటు హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ ఇప్పటికే అక్టోబర్ 21న రావడానికి సిద్ధమైంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus