ఇండస్ట్రీ పై దారుణమైన దెబ్బ పడినట్టే..!

ప్రతీ ఏడాది … సంక్రాంతి తర్వాత టాలివుడ్ కు ఆ రేంజ్ లో క్యాష్ చేసుకునే సీజన్ ఏంటి అంటే అందరూ సమ్మర్ సీజన్ అనే చెబుతారు.కానీ ఈ సారి దెబ్బ పడిందనే చెప్పాలి. మార్చి 22 నుండీ లాక్ డౌన్ మొదలైంది. థియేటర్లు కూడా మూత పడ్డాయి. ఏప్రిల్ నెల ఎలాగూ థియేటర్ లు ఓపెన్ కాలేదు.జూన్ వరకూ ఓపెన్ అవుతాయి అనే నమ్మకం కూడా కచ్చితంగా లేదు అనే చెప్పాలి.కాబట్టి మొదటి 100 రోజుల మన 2020 టాలివుడ్ రిపోర్ట్ చూసుకుంటే.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయినా మూడు రోజుల తర్వాత అంటే వీకెండ్ తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయినట్టు తయారయ్యింది పరిస్ధితి.

అదెలాగో ఓసారి చూద్దాం రండి. మొదటగా జనవరి 1న డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రం పర్వాలేదు అనిపించింది. సో ఓపెనింగ్ పరంగా పర్వాలేదు. తరువాత ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ‘దర్బార్’ పెద్దగా రాణించలేకపోయింది. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అయ్యి రికార్డు కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇక అదే నెలలో వచ్చిన ‘డిస్కో రాజా’ డిజాస్టర్ కాగా.. ‘అశ్వద్ధామ’ యావరేజ్ గా నిలిచింది.

ఇక ఫిబ్రవరి లో వచ్చిన క్రేజీ సినిమాలు ‘జాను’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాలు డిజాస్టర్లు కాగా ‘భీష్మ’ సూపర్ హిట్ అయ్యింది. తరువాత వచ్చిన ‘హిట్’ ‘ కనులు కనులను దోచాయంటే’ చిత్రాలు హిట్ అయ్యాయి. కానీ ‘ఓ పిట్ట కథ’ ‘అనుకున్నది ఒకటి అయినది ఒకటి’ చిత్రాలు ప్లాప్ లు అయ్యాయి. ఇక ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అవి ఎప్పుడు విడుదల అవుతాయో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి సమ్మర్ కి సినిమాలు లేకపోవడం టాలీవుడ్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus