సంక్రాంతి సెంటిమెంట్ ను ఈ సినిమాలు రిపీట్ చేస్తాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి అతిపెద్ద సీజన్లలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండుగ సమయంలో పెద్ద సినిమాలు కచ్చితంగా విడుదలవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జనవరి 14వ ఏదీన సినిమా రిలీజైతే సినిమా హిట్ అని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. ఇప్పటికే విడుదలైన పలు సినిమాలు ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది జనవరి 14వ తేదీన రెండు సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గతంలో జనవరి నెల 14వ తేదీన నువ్వులేక నేనులేను, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, లక్ష్మీ, గోల్కొండ హైస్కూల్, బాడీగార్డ్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో దాదాపుగా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. ఈ నెల 14వ తేదీన వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. వారసుడు మూవీ తమిళంలో సక్సెస్ సాధించగా కళ్యాణం కమనీయం సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఈ రెండు సినిమాలలో వారసుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కగా కళ్యాణం కమనీయం పరిమిత బడ్జెట్ తో తెరకెక్కింది. సంక్రాంతి సినిమాలన్నీ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus