చిరంజీవి, సురేఖ ల పెళ్ళికి నేనే కారణమంటుంది ఓ హీరోయిన్. ఆవిడ మరెవరో కాదు అలనాటి హీరోయిన్ రాజశ్రీ. ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ” చిరంజీవి పెళ్ళి కావడానికి నేనే సాయం చేసాను. నేను చిన్నప్పటి నుంచీ ఇండస్ట్రీలో అందరికంటే అల్లు రామలింగయ్య గారి కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండేదాన్ని. నాకే కాదు మా ఫ్యామిలీకి.. ఆయన ఫ్యామిలీకి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి.
ఎక్కువ వాళ్ళ పిల్లలతో కలిసి నేను ఆడుకునే దాన్ని. అయితే నేను ఓసారి ‘అత్తను దిద్దిన కోడలు’ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు… అల్లు రామలింగయ్య గారు వచ్చి.. ‘కొత్తగా ఇండస్ట్రీలో ఓ కుర్రాడు వచ్చాడు. చాలా బాగుంటాడు. డ్యాన్సులు, ఫైట్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మా అమ్మాయి సురేఖను ఆ అబ్బాయికి ఇద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు..?’ అంటూ అని నన్నడిగాగారు. కొత్తకుర్రాడు.. డ్యాన్స్ లు, ఫైట్ లు బాగా చేస్తున్నాడు అంటున్నారు… కచ్చితంగా ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చేసెయ్యండి… అని చెప్పాను.
Most Recommended Video
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు