సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేవాళ్లకు.. ఆరంభంలో పూల పాన్పులతో స్వాగతం పలికేవారు అంటూ ఎవ్వరూ ఉండరు. స్టార్స్ వారసులకు మాత్రమే అలాంటివి దక్కుతాయి. మిగిలిన వాళ్ళు అన్ని రకాలుగా కష్టపడాలి ప్రూవ్ చేసుకోవాలి.గుర్తింపు లభించిన తర్వాత అవకాశాలు వాటికవే వస్తాయి. నటీనటులు ఎదుర్కొన్న కష్టాలు… ఆ టైంలో చెప్పుకుంటే ఎక్కువమంది వినరు.. ఇంట్రెస్ట్ చూపించరు. అదే సక్సెస్ అయ్యాక చెప్పుకుంటే.. అవి గొప్ప పాఠాలుగా భావించి వాట్సాప్ స్టేటస్ లు వంటివి పెట్టుకుని మరీ షేర్ చేస్తారు.
ఇది పక్కన పెడితే.. గతంలో ఓ హీరోయిన్ కూడా చాలా కష్టాలు పడిందట. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాక ఉండే కష్టాల గురించి మాట్లాడితే.. దానికి ముందుకు కూడా ఆమె ఎన్నో ఎన్నో కష్టాలు పడినట్టు తెలిపింది. పాకిస్తాన్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన మహీరా ఖాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు అని చెబుతుంది. ఆమె మాట్లాడుతూ.. “నేను నటిని కాక ముందు అంటే నా 17 ఏళ్ల వయసులో చదువు కోసం యూఎస్ వెళ్లాను.
ఆ టైంలో నా (Mahira Khan) నిత్యావసర ఖర్చుల కోసం డబ్బుల్లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.అందుకోసం ఫ్లోర్లు తుడవడం, టాయిలెట్లు కడగడం వంటి పనులు కూడా చేశాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక మహిరా ఖాన్ షారుఖ్ ఖాన్ కి జోడీగా ‘రయీస్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అటు తర్వాత ఆమె ఇండియాలో కూడా భారీ అభిమానులను సంపాదించుకుంది. 38 ఏళ్ల మహీరా ఇటీవల వ్యాపారవేత్త సలీమ్ కరీమ్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!