షాకింగ్‌ విషయం రివీల్‌ చేసిన నాటి స్టార్‌ హీరోయిన్‌

సినిమాల్లో వరుసగా నటించినప్పుడు నటులు గుర్తుంటారు. ఒక్కసారి ఇండస్ట్రీకి దూరమైపోతే మళ్లీ వారి గురించి ఎవరూ పట్టించుకోరు. మా పరిస్థితి ఇదీ అంటూ వాళ్లు చెబితే కానీ.. తెలియదు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నరు ప్రముఖ నటి భానుప్రియ. కథానాయికగా, సహా నటిగా అనేక సినిమాల్లో నటించిన భానుప్రియ ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నారు. ఏమైందా అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది. ఆమె శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందిపడుతున్నారట. ఈ విషయం తెలియడంతో ‘భానుప్రియకు అంత కష్టం వచ్చిందా?’ అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

భానుప్రియ అంటే ఇప్పటి తరం సినిమా జనాలకు పెద్దగా తెలియదు. కానీ 80ల, 90ల కాలం నాటి సినీ గోయర్స్‌ తెగ మురిసిపోతారు. ఎందుకంటే ఆమె అందం, అభినయం, నటన అంత అద్భుతంగా ఉంటాయి మరి. అతి కొద్ది కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి చేరింది భానుప్రియ. ఆమె నాట్యం చూసి.. కళ్లార్పని ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె డైలాగ్ డెలివరీ అసాధారణం అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్స్‌ గుర్తుండకపోవడం వల్లే సినిమాలకు దూరమయ్యారట. అవును ఆమె మెమొరీ లాస్‌తో బాధపడుతున్నారట.

‘‘నా భర్త చనిపోయారు అప్పటి నుండి ఇబ్బందుల్లో పడ్డాను. ఆరోగ్యం బాగా పాడైంది. దానికితోడు మెమరీ లాస్ వచ్చింది’’ అని భానుప్రియ చెప్పారు. ఈ కారణంతోనే ఆమె సినిమాలకు దూరమయ్యారు అని తెలుస్తోంది. భానుప్రియకు సెట్స్‌లో డైలాగ్స్ గుర్తుండటం లేదని, ఆఖరికి డ్యాన్స్‌కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుకురావడం లేదట. ఈ కారణంగానే ఆమె డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన డ్యాన్స్‌ స్కూల్‌ ఆలోచనను కూడా పక్కనపెట్టేశారట. అయితే ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

దాంతోపాటు తన మీద గతంలో వచ్చిన పుకార్లపై కూడా భానుప్రియ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భానుప్రియ భర్త కన్నుమూయక ముందు విడిపోయినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని కొట్టిపారేశారు. ఆయన అప్పట్లో విదేశాల్లో ఉండేవారని, అప్పుడప్పుడు ఆయనకు ఇక్కడకు రావడం, నేను అక్కడికి వెళ్లడం జరిగేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భాను ప్రియ కూతురు అభినయ లండన్ చదువుకుంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus