Star Actress: సమంత హీరో తో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్!

ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లందరూ ఇంట గెలిచి రచ్చ గెలిచినవారు కొంతమంది.. అయితే రచ్చ గెలిచి ఇంట గెలిచినవారు మరికొందరు. ఇక ఇప్పుడు ఇంట గెలిచిన ఒక హీరోయిన్ రచ్చ గెలవడానికి బయలుదేరింది. ఆమె మహానటి కీర్తి సురేష్. ఈ ఏడాది దసరా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న కీర్తి సురేష్ తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అట్లీ తన తర్వాత సినిమా కూడా బాలీవుడ్ హీరోతోనే ఉండనుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో అట్లీ ఒక సినిమ చేయనున్నాడట. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం అమ్మడు చాలా కష్టపడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆమె అట్లీతో కలిసి ఎన్నోసార్లు కనిపించింది. దీంతో ఈ వార్తల్లో నిజముందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇక జవాన్ తర్వాత నాలుగు నెలలు గ్యాప్ తీసుకున్న అట్లీ త్వరలోనే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించనున్నాడట. ఇప్పటికే వరుణ్ ధావన్ సిటాడెల్ సినిమాలో సమంతతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమంత హీరోతో కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అట్లీ, కీర్తి సురేష్ కి ఆఫర్ ఇవ్వడం అంటే ఆమె రొట్టె విరిగి నెయ్యిలో పడినట్టే అని అభిమానులు చెప్పకువస్తున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ ఒకవేళ ఇదే కనుక నిజమైతే కీర్తి సురేష్ (Star Actress) బాలీవుడ్ ఎంట్రీ మోత మోగిపోనున్నట్లు తెలుస్తుంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus