ఆ స్టార్ కమెడియన్ వల్ల నాకు ఆఫర్లు రాకుండా పోయాయి..!

తన మిమిక్రితో అందరినీ నవ్వించే శివా రెడ్డి.. అందరికీ గుర్తుండే ఉంటాడు. పలు ఫంక్షన్స్ కు శివారెడ్డి మిమిక్రీ పెట్టించి ప్రేక్షకులని అలరించేవారు. విదేశాల్లో కూడా ఎన్నో ఈవెంట్స్ లో తన మిమిక్రి తో పాపులర్ అయ్యాడు శివారెడ్డి. వాటికి ఎన్నో అవార్డులను .. షీల్డ్స్ ను కూడా అందుకున్నాడు. ఇక సినిమాల పరంగా చూసుకుంటే.. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా కూడా నటించాడు. అయితే ఈమధ్య కాలంలో ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

శివారెడ్డి మాట్లాడుతూ ..” ‘దూకుడు’ చిత్రంలో నా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో నేను బిజీ అవుతానని అంతా భావించారు. కానీ ఆ తరువాత ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఓ స్టార్ కమెడియన్ నాకు అవకాశాలు రాకుండా చేశాడు. సినిమాలను మాత్రమే నమ్ముకుని వుంటే.. నేను ఎప్పుడో రోడ్డున పడేవాడిని. ప్రైవేట్ ఈవెంట్స్ .. స్టేజ్ షోలు .. టీవీ షోలు నన్ను చాలా వరకూ ఆదుకున్నాయి. వేరే సోర్స్ లేకపోతే ఆయన కాళ్ళు పట్టుకుని రాజీపడాల్సి వచ్చేదేమో. అప్పుడు కూడా ఆయన కరుణిస్తే సినిమాలు చేసుకునేవాడిని .. లేకాపోతే అడ్రస్ లేకుండా పోయేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus