వైవీఎస్ చౌదరి (YVS Chowdary) ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా వెలిగిపోయాడు. ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన, ‘సీతారామరాజు’(Seetharama Raju), ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’ (Devadasu) లాంటి విజయవంతమైన సినిమాలతో తన సత్తా చాటాడు. 2000ల సమయంలో ఆయన జోరు అంతా ఇంతా కాదు, స్టార్ హీరోలతో వరుస హిట్స్ అందుకున్నాడు. చివరి హిట్ చూసింది 2006లో దేవదాసు సినిమాతో. కానీ, 2008లో ‘ఒక్క మగాడు’ (Okka Magaadu) సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అతని కెరీర్ ఒక్కసారిగా దెబ్బతింది, ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో క్రేజ్ కోల్పోయాడు.
‘ఒక్క మగాడు’ తర్వాత వైవీఎస్ చౌదరి చేసిన సినిమాలు ‘నిప్పు’’ (Nippu), ‘రేయ్’ (Rey) కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘నిప్పు’ సినిమాను గుణశేఖర్‌ను (Gunasekharan) డైరెక్టర్‌గా తీసుకుని రవితేజతో (Ravi Teja) నిర్మించినప్పటికీ, అది కూడా విఫలమైంది. ‘రేయ్’ సినిమాతో సాయిధరమ్ తేజ్‌ను (Sai Dharam Tej) హీరోగా పరిచయం చేసినప్పటికీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఈ వరుస ఫ్లాపులతో గత 10 ఏళ్లుగా వైవీఎస్ చౌదరి సినిమాలకు దూరమయ్యాడు, ఇండస్ట్రీలో ఆయన కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు.
అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైవీఎస్ చౌదరి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నందమూరి జానకీరామ్ కుమారుడు (Janaki Ram Nandamuri) ఎన్టీఆర్‌ను (Jr NTR) హీరోగా పరిచయం చేస్తూ ఓ కొత్త సినిమాను ప్రకటించి సర్‌ప్రైజ్ చేశాడు. నందమూరి వారసుడితో కొత్త ప్రాజెక్ట్‌ను మే 12న భారీ స్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వైవీఎస్ వెల్లడించాడు. ఈ ఈవెంట్‌లో హీరో, హీరోయిన్ లుక్‌ను కూడా రివీల్ చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ సాహిత్యం, సాయి మాధవ్ బుర్రా మాటలు రాయనున్నారు. ఈ టెక్నీషియన్స్ ఎంపికతో సినిమాపై అంచనాలు మొదలయ్యాయి.
అయితే, ప్రాజెక్ట్ ప్రకటన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయిన వైవీఎస్, మళ్లీ రీసెంట్ అప్‌డేట్‌తో ఆసక్తి రేకెత్తించాడు. ఈ సినిమా షూటింగ్ 2025 జూలైలో మొదలై, 2026లో విడుదల కానుందని అంటున్నారు. వైవీఎస్ చౌదరి (YVS Chowdary) ఈ సినిమాతో మళ్లీ ట్రాక్‌పైకి వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. నందమూరి వారసుడితో సినిమా చేయడం ద్వారా ఆయన మళ్లీ ఇండస్ట్రీలో స్థానం సంపాదించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. గత వైభవాన్ని చాటుకునేలా వైవీఎస్ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేస్తాడా, లేదా అనేది చూడాలి.