నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’. డిసెంబర్ 2న విడుదలైన ఈ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని నమోదుచేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ కెరీర్లో అత్యధికంగా రూ.65కోట్ల వరకు వసూళ్ళని రాబట్టింది ఈ చిత్రం. ఏపిలో టికెట్ రేట్ల ఇష్యు ఉన్నప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. ఈ చిత్రం విజయంతో టాలీవుడ్ కు కొత్త ఊపు వచ్చింది.
పెద్ద సినిమాలన్నీ విడుదలకి ముస్తాబవుతున్నాయి. ఆ విధంగా టాలీవుడ్ కు బూస్ట్ ఇచ్చింది అఖండ చిత్రమనే చెప్పాలి.బోయపాటి శ్రీను- బాలయ్య కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్లు కొట్టడంతో ఈ మూవీ పై మొదటి నుండీ భారీ అంచనాలు నమోదయ్యాయి. అయితే ‘అఖండ’ చిత్రం గురించి.. కథ గురించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్లు చేసాడు.’ ‘అఖండ’ చిత్రం టాలీవుడ్ దర్శక నిర్మాతలకి ధైర్యాన్ని ఇచ్చింది.
బాలకృష్ణ కెరీర్లోనే రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం కథని పట్టుకుని బోయపాటి శ్రీను చాలా ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగాడు. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. ముందుగా హీరో – దర్శకుడు ఈ కథ చెయ్యాలని డిసైడ్ అయ్యారు కానీ నిర్మాతలు ముందుకు రాలేదు. చివరికి మిర్యాల రవీందర్ ధైర్యం చేసి ఓకే చేసాడు. నిజానికి ‘అఖండ’ కథని బోయపాటి కాకుండా వేరే ఎవరైనా వినిపించడానికి నిర్మాతల వద్దకు వెళ్తే గేటు బయటి నుండే పంపించేస్తారు.
బాలకృష్ణ గారు తెల్ల గెడ్డంతో ఉండడం ఏంటి? ఆయన పక్కన హీరోయిన్ లేక పోవడం ఏంటి? అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా?ఏ నిర్మాతకైనా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి.? అయినా ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగాడు.. బ్లాక్ బస్టర్ కొట్టగలిగాడు బోయపాటి” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!