Pelli Sandadi: పెళ్లి సందడి ఆ హీరోలు చేసి ఉంటే ఎలా ఉండేదో..బ్యాడ్ లక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీ లో కొన్ని సినిమాలను ఎప్పటికీ మరచిపోలేము, తీరిక దొరికినప్పుడల్లా ఆ కల్ట్ క్లాసిక్ చిత్రాలను చూస్తూ ఉంటాము. అలాంటి సినిమాలలో ఒకటి ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించిన ‘పెళ్లి సందడి’. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. కె రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా , రవళి మరియు దీప్తి భట్ హీరోయిన్స్ గా నటించారు.

అప్పట్లోనే ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి, అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు, పలు సెంటర్స్ లో సంవత్సరం రోజులు కూడా ఆడింది. అప్పటి వరకు మామూలు హీరోగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న శ్రీకాంత్ ని ఈ చిత్రం స్టార్ హీరోగా నిలబెట్టింది.ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హీరో గా వంద సినిమాలను పూర్తి చేసి, ఇప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.

అప్పట్లో ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి కీరవాణి అందించిన అద్భుతమైన సంగీతం. ఆ పాటలు ఇప్పటికే మనం వింటూనే ఉంటాము, మన మొబైల్స్ ప్లే లిస్ట్ లో ఈ పాటలు కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు రాఘవేంద్ర రావు మైండ్ లో శ్రీకాంత్ పేరు లేదట. ఆయన ఈ సినిమాని విక్టరీ వెంకటేష్ తో కానీ, జగపతి బాబు తో కానీ చేద్దామని అనుకుంటూ ఉన్నాడు.

వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడం తో , అప్పుడే ఇండస్ట్రీ లో వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న శ్రీకాంత్ ని ఎంచుకున్నారు. ఇక ఆ తర్వాత చరిత్ర మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే శ్రీకాంత్ కొడుకు కూడా ఇదే పేరుతో సినిమా తీసాడు. కమర్షియల్ సక్సెస్ అయ్యింది, ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల ప్రస్తుతం ఏ రేంజ్ లో ఉందొ చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ కొడుకు కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు ఈ సినిమాతో.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus