Vijay Sethupathi: జవాన్ విజయ్ సేతుపతి రోల్ ని ఆ హీరో మిస్ చేసుకోవడానికి కారణం అదేనా..!

  • September 11, 2023 / 01:12 PM IST

బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం లేక కరువులో ఉన్న బాలీవుడ్ కి ఈ ఏడాది షారుఖ్ ఖాన్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు అనే చెప్పాలి. ఏడాది ప్రారంభం లో ‘పఠాన్’ సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్, ఇప్పుడు ‘జవాన్’ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

నిన్న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ మరియు తమిళం బాషలలో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే మొదటి రోజు సుమారుగా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది బాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డు అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా విజయ్ సేతుపతి నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన పాత్రకి కూడా ఈ చిత్రం లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రెండు డిఫరెంట్ గెటప్స్ తో ఈ సినిమాలో (Vijay Sethupathi) విజయ్ సేతుపతి తన నట విశ్వరూపం చూపించాడు. ఆయన వల్ల ఈ సినిమాకి తమిళం లో కూడా మంచి మార్కెట్ వచ్చింది. ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విజయ్ సేతుపతికి ఈ చిత్రం ద్వారా వేరే లెవెల్ పాపులారిటీ వచ్చింది.

అయితే ఈ పాత్ర ని తొలుత టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని చెయ్యాల్సింది అట. ఆయనకీ ఫోటో షూట్ కూడా జరిపారట అప్పట్లో. కానీ ఓల్డ్ ఏజ్ లుక్ లో ఎందుకో నాని సెట్ అవ్వడం లేదని డైరెక్టర్ అట్లీ కి అనిపించింది. ఇదే విషయాన్నీ నాని తో చెప్పగా, అలా అనిపిస్తే నేను ఈ పాత్రకి కరెక్ట్ కాదులే అని తప్పుకున్నాడట. ఒకవేళ నాని ఈ సినిమా చేసి ఉంటే బాలీవుడ్ లో ఆయనకీ మంచి మార్కెట్ వచ్చి ఉండేది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus