Amitabh Bachchan: ఆ విషయంలో ఆ హీరోకి ఫోన్ చేసి అభినందించిన అమితా బచ్చన్ ..!

టాలీవుడ్ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, చిన్న చిన్న పాత్రలతో మొదలై, ఆ తర్వాత హీరో గా మెల్లిగా రాణిస్తూ , ‘ఖైదీ’ అనే చిత్రం తో ఒక్కసారిగా విస్ఫోటనం లాగా బద్దలై ఇండస్ట్రీ ని షేక్ చేసి స్టార్ గా మారిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఆయనని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో చిరంజీవి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక వ్యసనం లాగ మారిపోయింది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత జనాల్లో అంతటి ప్రభావం చూపించిన నటుడు ఆయన. ఒక్కమాటలో చెప్పాలంటే చిరంజీవి వచ్చిన తర్వాతే టాలీవుడ్ కమర్షియల్ సినిమాలో ఎన్నో మార్పు వచ్చాయి. డ్యాన్స్ మరియు ఫైట్స్ అందరీ హీరోలకు వేగవంతం అయ్యాయి. అయితే అప్పట్లో చిరంజీవి యాక్షన్ మూవీస్ ని ఆడియన్స్ తెగ ఇష్టపడేవాళ్లు. ముఖ్యంగా ఆ తరం చిన్న పిల్లలు చిరంజీవి డ్యాన్స్ మరియు ఫైట్స్ కి ఎంతో ఆకర్షితులు అయ్యే వారు. అలాంటి సమయం లో వచ్చిన మెగాస్టార్ సినిమా ‘స్టేట్ రౌడీ’.

బి గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించి చిరంజీవి స్టార్ ఇమేజి ని మరింత పెంచింది. ఈ సినిమాలో చిరంజీవి ప్రారంభం నుండి చివరి 30 నిమిషాల వరకు రౌడీ గానే కనిపిస్తాడు. కాని చివర్లో తెలుస్తుంది ఆయన ఒక అండర్ కవర్ పోలీస్ అని, ఇదే థీమ్ తో మన జెనెరేషన్ లో పోకిరి అనే చిత్రం వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇదే తరహా సినిమాలు అప్పట్లో బోలెడన్ని వచ్చాయి.

అలా ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాతోనే చిరంజీవి బాలీవుడ్ బాద్షా (Amitabh Bachchan) అమితాబ్ బచ్చన్ ని మించిన రెమ్యూనరేషన్ ని తీసుకునే రేంజ్ కి ఎదిగాడు అంటూ బాలీవుడ్ లో ప్రముఖ మ్యాగజైన్స్ ప్రచురించాయి. ఆ మ్యాగజైన్ చదివిన అమితాబ్ బచ్చన్, వెంటనే చిరంజీవి కి ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. అలా ఇండియా మొత్తం మన వైపు చూసేలా చేసిన ఈ సినిమా అప్పట్లో 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసిందట. ఇది ఆల్ టైం రికార్డు గ్రాస్ కాదు కానీ, అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్స్ జాబితాలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus