మాస్ మహారాజ్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఏకైక బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమార్కుడు’. 2006 వ సంవత్సరం జూన్ 23న ఈ చిత్రం విడుదలైంది. ‘శ్రీ కీర్తి క్రియేషన్స్’ బ్యానర్ పై ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం అప్పటికి రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రవితేజ.. అత్తిలి సత్తిబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ వంటి రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం కనపరిచి అలరించాడు.
అనుష్క కూడా తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది.అజయ్ కూడా విలన్ పాత్రకు జీవం పోసాడని చెప్పాలి.కీరవాణి సంగీతంలో రూపొందిన ‘జింతాక్ తాక్’ ‘జుం జుం మాయ’ ‘అత్తిలి సత్తిబాబు’ వంటి పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా మైండ్ నుండి పోవట్లేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అయితే (Vikramarkudu) ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసిన స్టార్లు కొంతమంది ఉన్నారు.
వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. రాజమౌళి ఈ కథని మొదట బాలకృష్ణ కోసం అనుకున్నాడట. అయితే అతని తండ్రి విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసాడట. వాళ్లిద్దరూ కూడా ‘విక్రమార్కుడు’ కథలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజతో ముందుకు వెళ్ళాడు ఎస్.ఎస్.రాజమౌళి. అలాగే విలన్ పాత్ర కోసం అజయ్ కంటే ముందు ఓ బాలీవుడ్ సీనియర్ హీరోని అనుకున్నాడట. అతను వివేక్ ఒబెరాయ్ అని అప్పట్లో టాక్ బలంగా నడిచింది.
కానీ ఆ టైంలో రాజమౌళి పై బాలీవుడ్ కి నమ్మకం లేదు. కాబట్టి.. అంతవరకు వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో అజయ్ ను ఫైనల్ చేసి.. ఆ పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించారు రాజమౌళి. ఇలా ‘విక్రమార్కుడు’ ని ఆ స్టార్లు మిస్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయాలని స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అప్పుడు వేరు మరి..!
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్