సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
- January 31, 2025 / 12:15 PM ISTByPhani Kumar
సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఈ ఏడాది చూసుకుంటే ఇప్పటికే దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి వంటి వారు మరణించారు. ఇంతలోనే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఓ టాలీవుడ్ నిర్మాత ఈరోజు కన్నుమూశారు.
vedaraju timber
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ నిర్మాత వేద రాజు టింబర్ ఈరోజు మృతి చెందారు.ఆయన వయసు 54 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతూ వచ్చారని తెలుస్తోంది. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన హైదరాబాద్ లో ఉన్న ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారట. చికిత్స పొందుతూనే ఈరోజు ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది.

ఈయనకి కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. అక్కడ ఈయన బాగా రాణిస్తున్నారట. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆయన నిర్మాతగా మారారు. ఈ క్రమంలో అల్లరి నరేష్ తో ‘మడత కాజా’ ‘సంఘర్షణ’ వంటి సినిమాలు కూడా నిర్మించారు.ఆరోగ్యం కోలుకున్నాక తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన భావించారట. కానీ ఇంతలో ఇలా జరిగింది. వేద రాజుకి భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు ఆయన నివాసం వద్ద నిర్వహించబోతున్నారట.














