SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
- January 29, 2025 / 11:30 PM ISTByPhani Kumar
మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది ఈ మూవీ. అయితే అధికారికంగా ఈ సినిమాని ప్రకటించింది లేదు. ఓపెనింగ్ కి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటికి వదిలింది లేదు. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాని (Priyanka Chopra) కూడా ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్నారు. ఇటీవల ఆమె హైదరాబాద్ వచ్చి .. లుక్ టెస్ట్..లో పాల్గొని వెళ్ళింది.
SSMB 29

అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా ఈ సినిమా (SSMB 29) కోసం ఎంపికైనట్టు చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే రెండు రోజుల నుండీ అతని ప్లేస్లో జక్కన్న(రాజమౌళి) బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జాన్ అబ్రహంని (John Abraham) తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. అది విలన్ రోల్ అని అంటున్నారు. అతని పాత్రకి జోడీగా ప్రియాంక చోప్రాని తీసుకున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. ఈ తరుణంలో పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

ఓ నేషనల్ మీడియాతో ఆయన ముచ్చటించి దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.’ ‘ఎస్.ఎస్.ఎం.బి 29′ కోసం చాలా డిస్కషన్స్ జరగాలి. ఫైనల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఏది ఫైనల్ కాలేదు. నేను ఉన్నానా.. లేక వేరే ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. సో జాన్ అబ్రహం విషయంలో వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు అనే చెప్పాలి.
















