సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. ఆన్ స్క్రీన్ చూసి అభిమానించే స్టార్స్‌ని సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతూ ఆఫ్ స్క్రీన్ వారితో చాట్ చెయ్యడం, లైవ్‌లో మాట్లాడడం లాంటివి ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతినిస్తాయి. నెటిజన్లు ఎప్పటికప్పుడు సెలబ్స్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్లు ఏదైనా పిక్ షేర్ చేస్తే.. వేసుకున్న డ్రెస్ నుండి యాక్ససరీస్ వరకూ అన్నీ గమనిస్తూ.. నెట్లో సెర్చ్ చేసి మరీ వాటిగురించి తెలుసుకుంటుంటారు.
స్టార్స్ ఏ కాదు.. స్టార్ ఫ్మామిలీస్ గురించి కూడా నెట్టింట న్యూస్ వైరల్ అవతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ వైఫ్స్ లైఫ్ స్టైల్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి.. ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ వైఫ్స్ ఎవరు?.. ఏంటా కథ? ఇప్పుడు చూద్దాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన లివింగ్ స్టైల్ చూడ్డానికి సింపుల్‌గానే ఉంటుంది కానీ దానికోసం ఆమె చాలా ఖర్చు చేస్తారట. చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే.. ఉపాసన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ని చూశారు కదా.. దాని కాస్ట్ ఎంతో తెలుసా?.. అక్షరాలా 3,83,586 రూపాయలు.. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఈ జంట అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని విజిట్ చేస్తూ ఆ పిక్స్ షేర్ చేస్తున్నారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోెద్కర్ ఎప్పుడూ ట్రెండీగా కనిపిస్తుంటారు. సింపుల్‌గా, క్యాజువల్‌గా కనిపించే నమ్రత ఇటీవల వెకేషన్‌కి వెళ్లినప్పుడు తీసుకున్న పిక్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. ఆమె హ్యాండ్ బ్యాగ్, బ్రాస్లెట్ వంటి వాటి గురించి సెర్చ్ చేశారు నెటిజన్లు.. హ్యాండ్ బ్యాగ్ ధర 40 వేలు కాగా.. మరో పిక్‌లో ఆమె ధరించిన రెండు బ్రాస్ లెట్స్‌లో ఒకదాని కాస్ట్ 7,07,000 కాగా మరోటి 3, 69, 000..
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు.. కానీ తారక్‌తో కలిసి కనిపిస్తే మాత్రం ఆమె పిక్స్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తుంటారు. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లిన ప్రణతి.. భర్తతోపాటు ఫొటోలకు ఫోజులిచ్చారు. సూపర్బ్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా కనిపించిన ప్రణతి హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతో తెలుసా?.. 3, 57, 268 రూపాయలన్నమాట..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భార్య శాలిని కందుకూరి.. భర్తతో కలిసి దీవాళీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నానంటూ.. అందరికీ విషెస్ చెబుతూ షేర్ చేసిన పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చూడ్డానికి సింపుల్‌గా ఉంది కానీ శాలిని శారీ కాస్ట్ మాత్రం సాలిడ్‌గా ఉంది.. దాని కాస్ట్ అక్షరాలా 12, 29,000.. దానితో పాటు ఆమె పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్ కూడా హైలెట్‌గా కనిపిస్తోంది..
యంగ్ హీరో విష్ణు మంచు వైఫ్ విరానికా మంచు బేసిక్‌గా డిజైనర్.. తనకి మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విరానికా లగ్జరీ యాక్ససిరీస్తో కనిపిస్తుంటుంటారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా కనిపించే విరానికా షేర్ చేసిన ఈ పిక్‌లో హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ 2, 42, 582 కాగా.. ఫ్లిప్ ఫ్లాప్స్ కాస్ట్ 44, 995..