సినిమా మేకింగ్ లో మార్పు వచినట్టుగానే.. పబ్లిసిటీలోనూ చాలా మార్పులు వచ్చాయి. టీవీ, పేపర్లతో పాటు సోషల్ మీడియా ద్వారా తమ సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు యువతపై ఫోకస్ పెట్టారు. అందుకే సినిమా ప్రమోషన్స్ కి కాలేజీకి వెళుతున్నారు. స్టూడెంట్స్ తో కలిసిపోయి అల్లరి చేస్తూ.. అందరికీ మూవీ విశేషాలు చెబుతున్నారు. హీరో వస్తున్నారని తెలియడంతో ఎవరూ కాలేజీకి సెలవు పెట్టకుండా హాజరై, హీరోలతో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ విధానం సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తెచ్చి పెడుతుండడంతో అందరూ ఇదే బాటలో వెళుతున్నారు.
కేశవ సినిమాకు నిఖిల్ కాలేజీలోకి వెళ్లి సందడి చేయగా, నేనే రాజు.. నేనే మంత్రి కోసం రానా వివిధ ఏరియాలతో పాటు కాలేజీలను చుట్టారు. అర్జున్ రెడ్డి ని విజయ్ దేవరకొండ స్టూడెంట్స్ వద్దకు తీసుకెళ్లగా, ఇప్పుడు అక్కినేని నాగచైతన్య కూడా అదే బాటలో వెళుతున్నారు. తన తాజా చిత్రం యుద్ధం శరణం ప్రమోషన్లలో భాగంగా వైజాగ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లొవచ్చారు. అతనికి అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో లేడీస్ కాలేజీలోకి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ పద్ధతిని మరి కొంతమంది హీరోలు అనుసరించే ఆలోచనలో ఉన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.