ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవికి రీఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే అచ్చొస్తున్నాయి.
చిరంజీవి ఇదే తరహా కథలను ఎంచుకుంటే మాత్రం ఆయన కెరీర్ కు ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్యకు డ్యూయల్ రోల్ పోషించిన సినిమాలు అచ్చొస్తున్నాయి. వయస్సు మళ్లిన పాత్రలలో, ఎక్కువ ఏజ్ ఉన్న పాత్రలలో బాలయ్య నట విశ్వరూపం చూపిస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
విక్టరీ వెంకటేశ్ విషయానికి వస్తే ఆయనకు భిన్నమైన కథలు మాత్రమే అచ్చొస్తున్నాయి. దృశ్యం, దృశ్యం2 తరహా సినిమాలు నటుడిగా వెంకటేశ్ స్థాయిని పెంచుతున్నాయి. కథల ఎంపిక విషయంలో వెంకటేశ్ కరెక్ట్ గానే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వెంకటేశ్ పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నాగార్జున విషయానికి వస్తే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయి. నాగార్జున అలాంటి కథలను ఎంచుకుంటే మంచిది. సీనియర్ స్టార్ హీరోలు అభిమానులకు నచ్చే కథలను ఎంచుకుంటూనే ట్రెండ్ కు అనుగుణంగా కొన్ని విషయాలలో మారితే విజయాలను సొంతం చేసుకోవడం సాధ్యమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టీస్టారర్స్ పై దృష్టి పెడితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలకు మల్టీస్టారర్ సినిమాలు బెస్ట్ ఆప్షన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!