Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » రెండో పెళ్లిపై మనసు పడ్డ తారలు

రెండో పెళ్లిపై మనసు పడ్డ తారలు

  • November 18, 2016 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెండో పెళ్లిపై మనసు పడ్డ తారలు

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని అంటుంటారు పెద్దలు. అలా ఓ బ్రహ్మ ముహూర్తాన భూమిపై ఓ అబ్బాయి, ఓ అమ్మాయి దంపతులుగా ఒకటవుతారు. మాంగళ్య బంధం వారిని కలకాలం కలిపి ఉంచుతుంది. కానీ కొన్ని జంటలను విధి విడదీస్తుంది. మరికొన్ని జంటలు మనసులు కలవక విడిపోతుంటారు. నచ్చిన వ్యక్తితో నడవడానికి సిద్ధమవుతారు. ఇలాంటి సంఘటనలు సామాన్యుల ఇళ్లల్లోనే కాదు సెలబ్రిటీల జీవితాల్లోను జరుగుతుంటాయి. టాలీవుడ్ లో మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న కొంతమంది స్టార్స్ గురించి ఫోకస్.

ఎన్టీఆర్NTRమహానటుడు, రాజకీయ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకంలు అన్యోన్య దంపతులు. వీరికి 12 మంది సంతానం. అనారోగ్య కారణాల వల్ల బసవ తారకం మరణించారు. వృధ్యాప్యంలో ఒంటరి అయినా ఎన్టీఆర్ తన తోడుకోసం లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నారు.

కృష్ణKrishnaసూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో రాకముందే ఇందిరను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఐదు మంది సంతానం. కృష్ణ తన సహా నటి విజయ నిర్మలను ప్రేమించారు. దాంతో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి విజయ నిర్మలను మనువాడారు.

కృష్ణం రాజుKrishnam Rajuయంగ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు తొలి సతీమణి పేరు సీతాదేవి. వీరికి ఒక పాప పుట్టింది. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంపై విధి ఆగ్రహించింది. సీతాదేవి కారు ప్రమాదంలో చనిపోయింది. ఆ తర్వాత శ్యామల దేవిని కృష్ణం రాజు పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యతో కలిసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

మోహన్ బాబుMohan Babuడైలాగ్ కింగ్ మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారీ దంపతులు. కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తో విద్యాదేవి మరణించింది. ఆ తర్వాత విద్యాదేవికి చెల్లెలు అయిన నిర్మలా దేవిని మోహన్ బాబు వివాహమాడారు.

కమల హాసన్Kamal Hassanవిశ్వనటుడు కమల్ హాసన్ మొదట డ్యాన్సర్ అయిన వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పది సంవత్సరాలు కలిసి సంతోషంగా గడిపారు. బాబు కూడా పుట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. తర్వాత తనతో నటించిన హీరోయిన్ సారికను కమల్ రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ పిల్లలు కలిగారు. రెండో భార్యను కు కూడా విడాకులు ఇచ్చి నటి గౌతమితో సహజీవనం చేశారు. తాజాగా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు.

నాగార్జునNagarjunaకింగ్ అక్కినేని నాగార్జున మొదట ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య పుట్టాడు. కొంతకాలానికి కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. అనంతరం సహ నటి అమలతో జీవితాంతం నడుస్తానని నాగ్ ఏడు అడుగులు వేశారు. వీరిద్దరి ప్రేమకు ప్రతి రూపమే అఖిల్.

పవన్ కళ్యాణ్Pawan Kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట నందినిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి బద్రి హీరోయిన్ రేణు దేశాయ్ తో కొంతకాలం సహజీవనం చేసి, తర్వాత తాళికట్టి అర్ధాంగిని చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ప్రస్తుతం విదేశీ నటి అన్నా లెజినోవాతో పవన్ సహజీవనం చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్Prakash Rajవిలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మొదటి భార్య పేరు లలిత కుమారి. వారికి ఇద్దరు అమ్మాయిలు. కొన్ని మనస్పర్థలు కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ప్రకాష్ రాజ్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ని పెళ్లాడారు. ప్రస్తుతం వీరికో పాప.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Hassan Marriage
  • #Krishnam Raju Marriage
  • #Mohan babu Marriage
  • #Nagarjuna Marriage
  • #ntr marriage

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

19 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

2 days ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version