గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగింది. మిడిల్ రేంజ్ హీరోలు సైతం తమ సినిమాలను ఇతర భాషల్లో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర భాషల్లో సినిమాలను విడుదల చేయడం వల్ల నిర్మాతలకు శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో భారీ మొత్తం దక్కనుంది. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ప్రస్తుతం తమ సినిమాల్లో హీరోయిన్లుగా బాలీవుడ్ హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటించారు. వినయ విధేయ రామ సినిమాలో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటించగా ఈ సినిమా ఫ్లాపైనా శంకర్ చరణ్ కాంబినేషన్ మూవీలో సైతం కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీలో సైతం అలియా భట్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకొనే నటిస్తున్న సంగతి తెలిసిందే.
భవిష్యత్తులో సౌత్ ఇండియాలో గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లకు సైతం టాలీవుడ్ స్టార్స్ సినిమాలలో ఛాన్స్ దొరకడం సులువు కాదని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్స్ తమ సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటుతుండగా బాలీవుడ్ హీరోయిన్లకు టాలీవుడ్ లో రోజురోజుకు ప్రాధాన్యత పెరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికంతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్లు రెట్టింపు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు సినిమాలలో నటించడం వల్ల సినిమాలకు బిజినెస్ విషయంలో ప్లస్ అవుతోంది.
ఇప్పటికే బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు సౌత్ సినిమాలలో నటించడం ద్వారా తమ క్రేజ్ ను, మార్కెట్ ను మరింత పెంచుకోవచ్చని భావిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటించడానికి 4 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?