Pushpa Movie: పుష్పలో ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక నటిస్తుండగా వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో బన్నీ చెల్లిగా కనిపించనున్నారని తెలుస్తోంది. జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాల ద్వారా తెలుగులో వర్ష బొల్లమ్మ మంచి పేరును సంపాదించుకున్నారు. బన్నీకి చెల్లి పాత్ర అంటే వర్ష కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటికే రిలీజైన పుష్ప పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీస్థాయిలో అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో బన్నీకి విలన్ పాత్రలో నటిస్తున్నారు. బన్నీ ఈ సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పుష్ప పార్ట్1 క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది పుష్ప పార్ట్2 షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. పుష్ప పార్ట్1 షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తైనట్లు సమాచారం.

ప్రస్తుతం కాకినాడ పోర్టులో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 17వ తేదీన పుష్ప పార్ట్1 రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మొదట బన్నీ చెల్లి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తారని వార్తలు వచ్చినా ప్రస్తుతం వర్ష బొల్లమ్మ ఆ పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే వర్ష ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ రాగా త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus