రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాలవీధికి చెందిన జ్యోతి(26) హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తోంది.
అలానే ఓ ప్రయివేట్ బ్యాంక్ లో జాబ్ కూడా చేస్తోంది. సంక్రాంతికి తన సొంతూరుకు వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరింది. చిత్తూరు కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది.
రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్‌నగర్ స్టేషన్‌లో దిగింది. ఆ తరువాత వెంటనే తిరిగి ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదలడంతో ప్రమాదవశాత్తు ఆమె ప్లాట్ ఫామ్ పై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి.
రైల్వే పోలీసులు ఆమె ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించడానికి బంధువులు అభ్యంతరం చెబుతున్నారు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!