ఆ డైరెక్టర్లకు బాలయ్య తప్ప మరో ఆప్షన్ లేదనుకుంట..!

2020.. అందరి ప్లానింగ్స్ ను తారుమారు చేసి పడేసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పై దీని ప్రభావం ఎక్కువే పడింది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేకపోయాయి. అంతేకాకుండా షూటింగ్ ఫైనల్ స్టేజిలో ఉన్న సినిమాలు అలాగే.. సెట్స్ పైకి వెళ్లాల్సిన సినిమాలు చాలా ఆగిపోయాయి. దీంతో చాలా మంది దర్శకులు ఇప్పుడు ఖాళీగా గడుపుతున్నారు.

ఇప్పుడు షూటింగ్లు తిరిగి ప్రారంభమైనప్పటికీ.. హీరోలంతా తమ పెండింగ్ ప్రాజెక్టులను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయితేనే కానీ.. కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా యంగ్ హీరోలంతా రెండేసి, మూడేసి సినిమాలు పూర్తిచెయ్యాల్సి ఉంది. ఇక స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు కూడా బిజినే..! దాంతో కొంతమంది యంగ్ డైరెక్టర్ల పరిస్థితి అటు ఇటుగా మారింది. అందుకే చాలా మంది యంగ్ డైరెక్టర్లు బాలకృష్ణతో సినిమాలు ఓకే చేయించుకోవాలని క్యూలు కడుతున్నారట.

ఒకటి రెండు హిట్లు కొట్టిన డైరెక్టర్లంతా కూడా బాలకృష్ణ వద్దకు స్క్రిప్ట్ లు పట్టుకుని వెళ్తున్నారట. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత ఏ దర్శకుడితో పనిచేసేది ఇంకా ఆయన ప్రకటించలేదు. బోయపాటి సినిమా షూటింగ్ ప్రారంభమైన 4నెలల్లో పూర్తిచేసేలా ప్లాన్ చేసుకున్నాడట బాలయ్య. అందుకే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు.. బాలయ్య మాత్రమే ఆప్షన్ అన్నట్టు భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus