రాజమౌళి సినిమాల పై కుర్ర డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్…!

ఇటీవల నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ‘పారాసైట్’ అనే చిత్రాన్ని లాక్ డౌన్ సమయంలో చూడటానికి ట్రై చేసానని. మొదట చాలా స్లోగా ఈ చిత్రం సాగిందని… తరువాత నాకు నిద్రొచ్చేసిందని… తరువాత నా భార్య కథ చెప్పినా… ఎందుకో ఎక్కలేదని’ రాజమౌళి కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. ఓ డిజాస్టర్ సినిమా తీసిన దర్శకుడు రాజమౌళి ని మరియు అతని సినిమాల్ని విమర్శిస్తూ ఓ లేక రాసి దానిని తన సోషల్ మీడియాలో రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు.

ఆ దర్శకుడు మరెవరో కాదు… ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లను హీరోలుగా పెట్టి ‘మిఠాయి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు ప్రశాంత్ కుమార్. ఆ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు రాజమౌళిని విమర్శిస్తూ ట్వీట్ చేసాడు. ‘పారాసైట్’ అనేది ఒరిజినాలిటీ ఉన్న సినిమా. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకులు సైతం ప్రశంసించారు.ఇంత గొప్ప సినిమా గురించి.. మీలా ఎవ్వరూ మాట్లాడటం నేను వినలేదు. మీ సినిమాల్లో కనీసం ఒరిజినాలిటీ ఉండడు.

‘సై’ సినిమాలో ఓ సీన్ మొత్తం కాపీ చేసేసారు. ఇంకా మీరు డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు కాపీనే’ అంటూ ప్రశాంత్ కుమార్ ట్వీట్ చేసాడు. ప్రతీ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పలేము. నచ్చలేదు అని చెప్పడం కూడా తప్పు కాదు. ఎదో పబ్లిసిటీ కోసం.. టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడిని ఇలా విమర్శించడం కరెక్ట్ కాదనే చెప్పాలి.


Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus